ముడా కేసుకు సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో షాక్ తగిలింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సీఎం సిద్ధరామయ్యను విచారణకు హాజరుకావాలని మైసూర్ లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 6న విచారణకు హాజరు కావాలని సీఎంకు ఆదేశాలు జారీ చేశారు. మైసూరులోని లోకాయుక్త కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.