పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 18 వరకు ప్రభుత్వం పొడిగించిందని అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి కిష్టప్ప మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గడువు తీరిన తరువాత రూ. 500 రుసుంతో ఫీజు చెల్లించాలన్నారు. రెగ్యులర్ విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఫీజు చెల్లించాలని తెలిపారు.