మాజీ సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండపడ్డారు. వైయస్ జగన్‌ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వైయస్ జగన్‌పై 15 ఏళ్లుగా ఎల్లో మీడియా విషం చిమ్మనిరోజు లేదన్నారు. వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్ పటాపంచలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు.తండ్రి మరణించాక జగన్‌గారు కాంగ్రెస్ పార్టీ సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛగా పార్టీని స్థాపించి రాజకీయాలకు సిద్ధమైతే.. అదే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు చీకట్లో అదే కాంగ్రెస్‌తో చేతులు కలిపారు.
చంద్రబాబుకు కొమ్ము కాస్తూ తప్పుడు వార్తలు సైతం అచ్చేసే ప్రచార మాధ్యమాలు వైయస్ జగన్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ గత 15 ఏళ్లుగా విషం చిమ్మని రోజు లేదు. అయినా వారి విషపు రాతలు, రాజకీయ కుట్రలను పటాపంచలు చేస్తూ మా నాయకుడు వైయస్ జగన్, ఏ మాత్రం తగ్గకుండా మొక్కవోని ధైర్యంతో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ప్యారడైజ్ పేపర్లని, అర్థరాత్రి అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్లి పోతారని తప్పడు ప్రచారం చేసినా.. ప్రజలు ఆయన్ను ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేసినా, 40 శాతం మంది ఓటేశారని, వారు కూడా లేకుండా చేయాలనే కుట్రతో చంద్రబాబు, ఆయన భజన మీడియా చేయని కుట్ర లేదు. రోజూ అలుపు లేకుండా ఆ రాక్షసులంతా దాడి చేస్తున్నారు. రామోజీ పోయాక, తప్పుడు వార్తలు రాసి చంద్రబాబును కాసే పాత్ర ఆయన కొడుకు తీసుకున్నాడు. ‘జగన్‌కు ఆదాని లంచం రూ.1700 కోట్లు. జగన్‌ను ఆయన చీకట్లో మూడుసార్లు కలుసుకున్నారు. ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి’.. అంటూ, ఇంకా పుష్ప అంటే నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ అని ఈమధ్య సినిమాలో వచ్చింది. అది కూడా రాశారు అని తెలిపారు.