వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగరంలోని వేదాయపాళెం (5వ పట్టణ) పోలీసులకు వైయస్ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వ్యంలో భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు పోలీసులకు సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, రూరల్ ఇంచార్జి విజయ కుమార్ రెడ్డి, మాజీ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి , మాజీ విజయడైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి , డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీల్ అహ్మద్, ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.