సచివాలయ ఉద్యోగులందరూ నిబద్ధతతో పనిచేయాలని జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా నోడల్ ఆఫీసర్ రామ్గోపాల్ అన్నారు. శుక్రవారం సీతానగరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పి.త్రివిక్రమరావు ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈసందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న హౌస్ హోల్డ్ జియో లొకేషన్ సర్వే, ఎన్పీసీఐ లింకింగ్, పాఠశాల శానిటేషన్ ఇన్పెక్షన్, తదితర సర్వేలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు. ఉద్యోగుల హాజరు, క్షేత్ర స్థాయిలో వారు చేస్తున్న పనులపై సమీక్షించారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ డివైజ్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల సర్వేలలో ఆలస్యం జరుగుతుందని వారు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.