ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టి శుక్రవారం పాములపర్రు వచ్చిన సందర్భంగా ఆయనకు కూటమి నాయ కులు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కేశన శాంతకుమారి, టీడీపీ నాయకుడు తోట రాము, ఉండి నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కోమటి నరేంద్రబాబు మాట్లాడుతూ పాములపర్రు గ్రామానికి మంచినీరు ఇచ్చి రుణం తీర్చుకున్న గొప్పవ్యక్తి రఘురామ అని కొనియాడారు.
ఎంపీ టీసీ యడవల్లి వెంకటేశ్వరరావు, నరేంద్రబాబు, కేశన యాదగిరి, వర్రే సముద్రమూర్తి, తదిత రులు మాట్లాడుతూ గ్రామానికి 20 ఏళ్ల నుంచి వున్న మంచినీటి సమస్యను పరిష్కరించా రన్నారు. ఆరేడు, కోలమూరు, పాందువ్వ రోడ్, ఉండిలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. టీడీపీ మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.