రాష్ట్రంలోని సహజ వనరులను వినియోగించుకుంటూ, రాష్ట్ర స్థితిగతులు పూర్తిగా మార్చేలా స్వర్ణాంధ్రప్రదేశ్-2047 పేరుతో 10 సూత్రాల ప్రణాళికను టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి ప్రాంతానికీ ప్రయోజనం కలిగేలా.. సహజ వనరులను అభివృద్ధికి ఉపయోగించుకునేలా ఈ దశ సూత్రాలను రూపొందించారు. సీఎం చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలో ఆవిష్కరించిన విజన్-2047లో.. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. నైపుణ్యం గల మానవ వనరుల అభివృద్ధి, ప్రపంచస్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, డీప్‌టెక్ పరిజ్ఞానానికి పెద్ద పీట వేశారు. దశ సూత్రాలు ఏవంటే...
1. పేదరిక నిర్మూలన
2. ఉపాధి కల్పన
3. నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి
4. నీటి సంరక్షణ
5. రైతు-వ్యవసాయ టెక్నాలజీ
6. ప్రపంచస్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు
7. తక్కువ ధరలకే విద్యుత్
8. అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ
9. స్వచ్ఛాంధ్ర
10. డీప్ టెక్