పర్యావరణాన్ని పరిరక్షించుకొంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి. ఈ క్రమంలో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చూస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూస్తాం.
తద్వారా మత్స్య సంపదకు నష్టం కలగకుండా చర్యలు చేపడతాం అని చెప్పారు. కాగా, 25 నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జనసేన ఎంపీలకు పవన్ సూచనలు చేశారు. కాగా, ప్రభుత్వ భూముల అక్రమణలు, దౌర్జన్యంగా భూ దురాక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందినపుడు వెంటనే స్పందించాలని పోలీస్ శాఖకు పవన్ కల్యాణ్ సూచించారు.