పంచాయతీ కార్యదర్శి యాప్ లో వివరాలు నమోదు చేసుకున్న వారు ఉచితంగా ట్రాక్టర్లు, ఎడ్లబళ్లపై ఇసుక తీసుకెళ్లవచ్చని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు.
పోలీసులు అడ్డుకుంటే ఆ రసీదు చూపితే వదిలేస్తారన్నారు. శుక్రవారం తన ఛాంబర్ లో నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు. శనివారం నుంచి డెంకాడ వద్ద నిల్వ కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు.