గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ‘ప్రవాసీ ప్రజావాణి' ప్రత్యేక కౌంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం అభినందనీయమని, నల్లమల ప్రాంతంలోని ప్రవాసుల కుటుంబీకులు సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ బొజ్జ అమరేందర్ రెడ్డి కోరారు. బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్ద ఫిర్యాదులను స్వీకరిస్తున్నామన్నారు.