మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహాయుతి 232 సీట్లు, కాంగ్రెస్ తో కూడిన ఎంవీఏ కూటమి 52 సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రలో దారుణ పరాభవంపై రాహుల్ గాంధీ స్పందించారు. మహారాష్ట్ర ఫలితాలను విశ్లేషిస్తామని పేర్కొన్నారు.ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపైనా రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియా కూటమికి ఇంతటి మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించినందుకు గాను సీఎం హేమంత్ సోరెన్, పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ విజయం రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూపరిరక్షణ విజయం అన్నారు.వయనాడ్లో ప్రియాంక గాంధీ గెలుపుపై రాహుల్ గాంధీ స్పందిస్తూ... తన కుటుంబం, ప్రియాంకపై వయనాడ్ ప్రజలు నమ్మకం ఉంచారని, ఇందుకు తాను గర్విస్తున్నానన్నారు. వయనాడ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రియాంక పాటు పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.