ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం అన్నారు టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు తీసుకు వస్తామన్నారు.. అలాగే రాజధాని అమరావతి నిర్మాణాన్నిసైతం ముందుకు తీసుకు వెళ్తామన్నారు. కూటమిలో పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో సమయానుకూలంగా స్పందిస్తామని తెలిపారు. ఏపీ ఎంత అప్పుల ఊబిలో ఉందనే విషయాన్ని గత సమావేశాల్లోనే పార్లమెంట్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. నవంబర్ 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో టీడీపీ ఎంపీలు చంద్రబాబుతో సమావేశం అయ్యారు.ఈ సమావేశాల్లో అనుసరించ వలసిన వ్యూహంపై ఎంపీలతో సీఎం చంద్రబాబు చర్చించారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సైతం ఎంపీలతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీల పని తీరు పట్ల.. సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ తమ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో మరింత సమన్వయంగా కలిసి పని చేసుకోవాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు మరింత దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఎంపీలకు అప్పగించిన శాఖల బాధ్యతలు.. సంబంధిత మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.