విజయనగరంలో ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే విధంగా పురుగులతో కూడిన సీతాఫలాల విక్రయాల పై తనిఖీలు చేపట్టి వాటిని సీజ్ చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. గురువారం మార్కెట్లో ప్రజారోగ్య సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
ఈమధ్య మార్కెట్లో సీతాఫలాలు విరివిగా వస్తున్నాయని ప్రజలు కొనుగోలు సమయంలో పురుగులు ఉన్నవి లేనివి చూసి కొనుగోలు చేయాలని కమీషనర్ స్పష్టం చేశారు.