గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో గల రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆ గ్రామ సర్పంచ్ లెంక రామలక్ష్మి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ నాయకులు లెంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.