హైదరాబాదుకు చెందిన అలిమ్- కో, ఎస్. సొసైటీ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కురుపాం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో శుక్రవారం సదరం శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు మండలాలకు సంబంధించిన వికలాంగులు సదరం శిబిరంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.