డిఎస్సీ నుండి తమ పోస్టులు మినహాయించి, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు ముఖ్యమంత్రిని వేడుకొన్నారు.
ఈ మేరకు శనివారం పార్వతీపురం ఐటీడిఏ కార్యాలయం ఎదుట భిక్షాటన నిర్వహించారు. చంద్రన్న మమ్మల్ని ఆదుకోండి అని నినాదాలు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, దివాకర్, రమేష్, రాజేష్, వెంకట్, బిందు మాధవి, లక్ష్మి, మురళి, శ్రీను, కవిత తదితరులు పాల్గొన్నారు.