డిసెంబర్ 1న ఆదివారం సెలవు కావటంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో శనివారం బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయటం పట్ల పెన్షన్ దారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వడ్డాది టిడిపి టౌన్ పార్టీ అధ్యక్షులు దొండా నరేష్, గురుమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు.