రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం కింద నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని తహశీల్దార్లు, ఈఓ పీఆర్డీలను జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఆర్జీఎస్ఏ కార్యక్రమంపై జెసీ, డీజీపీఓ, డిఎల్డీఓ, మండల తహశీల్దార్లు, ఈఓపీఆర్డీలతో శనివారం కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 80 గ్రామ పంచాయితీ భవన నిర్మాణాల కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు.