ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ప్రతి నెలా మహిళా సమ్మాన్ యోజన స్కీమ్ కింద మహిళల బ్యాంక్ అకౌంట్‌లోకి రూ.1,000 జమ చేయాలని నిర్ణయించింది.
దీనికి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అయితే వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే ఈ సారి ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు ఆప్ పార్టీ డ్రామాలు ఆడుతోందని, మహిళలపై ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.