మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం గం.10.30కు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు, రాచకొండ పోలీసుల ఆదేశాల మేరకు మోహన్ బాబు, మంచు మనోజ్ లైసెన్స్ డ్ తుపాకులను ఫిలింనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, తన ఇంటి వద్ద జర్నలిస్ట్‌ల మీద మోహన్ బాబు దాడి చేసినట్లుగా ఉన్న వీడియో నెట్టింట వైరల్‌గా నటుడు మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తన పెద్ద కొడుకు మంచు విష్ణుతో కలిసి ఆయన కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. మరోవైపు, జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని నిరసిస్తూ పలువురు జర్నలిస్టులు కాంటినెంటల్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు