మారుతి సుజుకి భారతీయ మార్కెట్లోకి తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కారు ఫీచర్లను పరిశీలిస్తే ఇది 1.0-లీటర్ 3-సిలిండర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తుంది. పెట్రోల్-మాన్యువల్ వేరియంట్ లీటరుకు 25.24 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఇక ధర విషయానికొస్తే ప్రారంభ ధర రూ.4.99 లక్షలుగా ఉంది.ఈ పరిమిత ఎడిషన్ ఈ ఏడాది చివర్లో మంచి వినియోగదారులకు మంచి ఎంపికగా మారనుంది. ఇందులో అనేక ఉచిత యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. క్రోమ్ ఇన్సర్ట్లతో కూడిన సైడ్ మోల్డింగ్, రూఫ్ స్పాయిలర్, డ్యూయల్-కలర్ డోర్ సిల్ గార్డ్లు, ఫ్యాన్సీ ఫ్లోర్ మ్యాట్లు అమర్చారు. లిమిటెడ్ ఎడిషన్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇది 1.0-లీటర్ 3-సిలిండర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 6bhp పవర్, 89nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఇంతే కాకుండా CNG వేరియంట్లో ఈ ఇంజన్ 56bhp శక్తిని మరియు 82.1nm యొక్క టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు, ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జత చేయబడుతుంది.