ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ట్రాక్‌పై భారీ సంఖ్యలో గుమికూడిన ముస్లింలు.. ఈ వీడియో బెంగాల్‌లో తీసిందేనా

national |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2024, 09:38 PM

ముస్లింలు పెద్ద సంఖ్యలో రైల్వే ట్రాక్‌ను దాదాపుగా ఆనుకొని ఉన్నట్టుగా గుమికూడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కువ మంది రైల్వే ట్రాక్‌కు చేరువగా ఉండటంతో.. లోకల్ రైలు నెమ్మదిగా వెళ్తూ కనిపించింది. ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌‌లో తీసిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజమేనా.. కాదా.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


పెద్ద ఎత్తున ముస్లింలు రైల్వే ట్రాక్‌కు అత్యంత చేరువగా గుమికూడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ సంఖ్యలో జనం పట్టాలకు అత్యంత చేరువగా ఉండటంతో.. రైలు చాలా నెమ్మదిగా వెళ్తూ కనిపించింది.


క్లెయిమ్ ఏంటి..?


‘పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు జిల్లాలోని మగ్రాహత్‌‌లోని దృశ్యాలు ఇవి. పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం.. తమ పార్టీకి నమ్మకస్తులైన ఓటర్లు అనే కారణంతో వారిని ఏం చేయడానికైనా అనుమతి ఇస్తుంది’ అంటూ అచింత్య మండల్ అనే యూజర్ ఎక్స్ హ్యాండిల్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు.


వాస్తవమేంటి..?


ఈ వీడియో వెనుక నిజాలేంటో తెలుసుకోవానికి మేం ప్రయత్నించగా.. ఫేస్‌బుక్, యూట్యూబ్ హ్యాండిల్స్ ఈ వీడియోను పోస్టు చేసినట్లు గుర్తించాం. తబ్లీగీ జమాత్‌‌కు అనుబంధంగా ఉన్న ముస్లింలు ఇజ్తేమా అనే కార్యక్రమం నిర్వహించినప్పటి వీడియో ఇది అని మా ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ‘దక్షిణ 4 పరగణాలులోని మగ్రాహత్‌లో.. డైమండ్ హార్బర్ నుంచి వెళ్తున్న ఓ లోకల్ రైలు ఇజ్తేమా గుండా వెళ్తోంది’ అని ఓ ఫేస్‌బుక్ పోస్టులో వీడియోను పోస్టు చేశారు.


మగ్రాహత్ ఇజ్తేమా 2024 ప్రార్థన రోజు పేరిట ఫేస్‌బుక్‌ పోస్టులో రాసి ఉండటాన్ని గమనించాం. ఈ ఏడాది డిసెంబర్ 21, 22, 2 తేదీల్లో మగ్రాహత్ ఇజ్తేమా నిర్వహించినట్లు ఫేస్ బుక్ పోస్టులు కనిపించాయి.


యూట్యూబ్‌లోనూ చాలా వీడియోలను గుర్తించాం. ఈ ఏడాదివే కాకుండా.. పాత వీడియోలు కూడా యూట్యూబ్‌లో కనిపించాయి. కింద ఎంబెడ్ చేసింది ఇటీవలి వీడియో.


ఇజ్తేమా అంటే..?


భారతదేశంలో తబ్లిగీ జమాత్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో ఉంది. తబ్లిగీ జమాత్ ఏటా ఇజ్తేమా వారాన్ని నిర్వహిస్తుంది, దీనిలో జమాత్ ప్రజలు తమ మతంలోని వివిధ అంశాలను చర్చిస్తారు. ఇటీవల, బంగ్లాదేశ్‌లోని రెండు గ్రూపుల ముస్లింల మధ్య ఇజ్తేమా వేదికపై గొడవ జరిగింది. రెండు గ్రూపులు తబ్లిగీ జమాత్‌కు చెందిన ఇద్దరు వేర్వేరు అధిపతుల అనుచరులు. ఒక సమూహం నిజాముద్దీన్ మర్కజ్‌ను అనుసరిస్తుంది మరియు మరొకటి ఢాకా మర్కజ్‌ను అనుసరిస్తుంది.


అసలు వాస్తవం ఏమిటీ...?


వైరల్ అవుతోన్న వీడియో నిజమేనని సజగ్ విచారణలో తేలింది. క్లెయిమ్‌లో పేర్కొన్నట్టుగా ఈ వీడియో బెంగాల్‌లోని 24 పరగణాలు జిల్లాలోని మగ్రాహత్‌కు చెందినది. ఈ క్లెయిమ్‌లో పేర్కొన్నట్టుగా మన దేశంలో రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకుగా ఉన్న వారి పట్ల చూసీ చూడనట్టు ఉంటున్నారనేది కూడా సత్యదూరమేమీ కాదు. రైల్వే ట్రాక్‌‌ను బ్లాక్ చేసినందుకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది కూడా నిజమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com