చాలా మందికి పానిక్ అటాక్ గురించి మాత్రం అవగాహన ఉండదు. శరీరంలో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. పలుమార్లు యాంగ్జైటీ వచ్చి శరీరం భయాందోళనకు గురవ్వడాన్ని పానిక్ అటాక్ అంటారు.పానిక్ అటాక్‌కు గురయ్యేవారు రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా పానిక్ అటాక్ వస్తుందని భయపడి కనీసం బయటకు వెళ్ళేందుకు కూడా ఇష్టపడరు.
పానిక్ అటాక్ లక్షణాలు
ఊపిరి అడకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వణికిపోవడం, ఖండరాలు బలహీనమవ్వడం, మరణ భయం, అతిసారం, వికారం, వణుకు, ఛాతీ నొప్పి, తిమ్మిరి, చెమటలు పట్టడం, నిరాశ వంటివి పానిక్ అటాక్‌కు సంబంధించిన లక్షణాలు.
మీరు తీవ్ర భయాందోళన లేదా సంబంధిత లక్షణాలను ఎదుర్కొంటుంటే, ప్రశాంతంగా ఉండటంపై దృష్టి పెట్టండి. మీకు కళ్లు తిరగడం అలా అనిపిస్తే కుర్చీపై లేదా నేలపై కూర్చోండి. లోతైన శ్వాస తీసుకోండి, మీ వేగవంతమైన శ్వాసను శాంతపరచడంపై దృష్టి పెట్టండి. ఒత్తిడిని తగ్గించే పనులు చేయండి, ఘగర్ అధికంగా ఉండే ఫుడ్స్ ని వదిలేయండి, బ్రీథింగ్ వ్యాయామాలు చేసి పానిక్ అటాక్స్ ను తగ్గించుకోవచ్చు. పరిస్థితి మరీ తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.