ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి వన్డే ఫిబ్రవరి 12, 2025న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. భారత జట్టు సిరీస్‌ను గెలుచుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిచింది. ఫిబ్రవరి 9న కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు, టీం ఇండియా వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాడ్ ఫాంకు ముగింపు పలకాలని కూడా భారత జట్టు భావిస్తోంది. బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించే కోహ్లీ పరుగులు సాధిస్తే, అది ఆతిథ్య జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ 4 వికెట్ల తేడాతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది, కానీ, రోహిత్ శర్మ సేన 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన నరేంద్ర మోడీ స్టేడియంలో విజయం సాధించేందుకు బరిలోకి దిగనుంది.
మూడో వన్డే కోసం భారత జట్టు తన ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేయవచ్చు అని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌ను, వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ప్రయత్నించవచ్చు. భారత్ తరపున రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. విరాట్ కోహ్లీ జట్టులో ముఖ్యమైన బ్యాట్స్‌మన్. స్పిన్ బౌలింగ్‌కు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ నాయకత్వం వహిస్తుండగా, ఫాస్ట్ బౌలింగ్‌కు హర్షిత్ రాణా, మహ్మద్ షమీ నాయకత్వం వహిస్తారు. చూడాలి టీంలో మార్పు ఉంటుందా.. లేదా అనేది....
![]() |
![]() |