ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో శుభమన్ గిల్ సూపర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించి వన్డే క్లాస్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూయించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 95 బంతుల్లో శతకం నమోదు చేశాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. సెంచరీ వీరుడు రోహిత్ శర్మ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లితో కలిసి శుభమన్ గిల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.
శుభమన్ గిల్ 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 95 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. రోహిత్ శర్మ ఒక్క పరుగు చేసి కీపర్ క్యాచ్‌గా వెనుదిరగగా, విరాట్ కోహ్లి ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 బంతుల్లో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 112 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీ, మూడో మ్యాచ్‌లో శతకంతో గిల్ రాణించాడు. తొలి వన్డేలో 87 పరుగులు, రెండో మ్యాచ్‌లో 60, మూడో మ్యాచ్‌లో 102 పరుగులతో మొత్తం 259 పరుగులు చేశాడు.
![]() |
![]() |