ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL టోర్నమెంట్ 2025 ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అన్ని ఏర్పాట్లు చేసేసింది. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఏకంగా ఐదు జట్లు పాల్గొనబోతున్నాయి. 2024 సంవత్సరం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB ) తన టైటిల్ ను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగబోతుంది. గ్రూప్ స్టేజ్లో ఏకంగా 20 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. మార్చి 15వ తేదీన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి ఫైనల్ మ్యాచ్ ముంబై వేదికగా జరగనుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ గతంలో లాగానే జియో సినిమా ఆప్ లో చూడవచ్చు. లేదా స్పోర్ట్స్ 18 నెట్వర్క్ ద్వారా మనకు లైవ్ అందుబాటులో ఉంటుంది. వీటిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు పూర్తిగా ఉచితంగా చూడవచ్చు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే జియో సిమ్ మాత్రం కచ్చితంగా ఉండాలి. జియో కస్టమర్లకు మాత్రమే ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మ్యాచ్ లు అన్ని రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. టి20 ఫార్మాట్ కావడంతో రాత్రి 11 గంటల సమయానికి మ్యాచులు పూర్తి అవుతాయి.
![]() |
![]() |