మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే టీడీపీ కార్యకర్తల సంక్షేమంపై పార్టీ నేతలతో ఆయన ప్రధానంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఎంపీ భరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, ఏఎస్ రామకృష్ణలతో కమిటీ ఏర్పాటుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కష్టపడి పని చేసి భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్‌ను గెలిపించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
![]() |
![]() |