రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. శుక్రవారం గూడూరులోని వెలుగు కార్యాలయంలో ఎంపీపీ సునీత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈసమావే శానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరై మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు భూ సమస్య లపై ఇబ్బందులు పడుతున్నారని, రెవెన్యూ అధికారులు రైతులను కార్యాలయాల చుట్టు తిప్పుకోకుండా భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అలాగే నియోజకవర్గంలో వలసల నివారణపై అధికార యంత్రాగం దృష్టి సారించాలన్నారు.
బర్డ్ ఫ్లూపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సి అవసరం లేదని ప్రభుత్వం అన్ని రకాలు గా చర్యలు తీసుకుంటుం దన్నారు. వేసవి కాలం దృష్యా ఎక్కడ నీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవా లన్నారు. పశువులు, గొర్రెలు గ్రామాల్లో నీటి వసతి ఉన్న చోట తోట్లు ఏర్పాటు చేయాల న్నారు. పది పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమా వేశంలో తహసీల్దార్ రామాంజనేయులు, ఎంపీడీవో శివనాగప్రసాద్, పరిపాల నాధికారి విజయసింహారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
![]() |
![]() |