కడప జిల్లా, వేంపల్లె పాపాఘ్ని నది ఒడ్డున వెలసిన వృషభాచలేశ్వర ఆలయం నెలకొని ఉన్న ఎద్దులకొండ రోడ్డుకు రూ.1.19కోట్ల ఈఏపీ నిధులతో తారురోడ్డు నిర్మాణానికి శుక్రవారం టీడీపీ మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి భూమిపూజ చేశారు. జనవరి 19వ తేదీన గుంతలమయం ఎద్దల కొండ రోడ్డు, భక్తులు పడుతున్న నేపథ్యంలో స్థానిక నాయకులు టీడీపీ ఇనచార్జి బీటెక్ రవి దృష్టికి తీసుకెళ్లగా గతంలో మంజూరై పనులు చేయని ఎద్దల కొండ రోడ్డు విషయం ఉన్నతాధికారులతో మాట్లాడి తిరిగి మంజూరు చేయించారు. శుక్రవారం ఎద్దల కొండ వద్ద టీడీపీ మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి, మండల కన్వీనర్ మునిరెడ్డి, దేవస్థాన మాజీ చైర్మన ఎద్దల కొండ్రాయుడు, మాజీ సభ్యులు పి.వి రమణ, పీఆర్ డీఈ సుధాకర్‌రెడ్డి, ఈఓ విశ్వనాథరెడ్డి తదితరులు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు జగన్నాథరెడ్డి, పులివెందుల పట్టణ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, యువనాయకులు రజనీకాంతరెడ్డి, షబ్బీర్, జిల్లా ఉపాధ్యక్షులు రామగంగిరెడ్డి, నల్లగారి కృష్ణారెడ్డి, బాలం వెంకటసుబ్బయ్య, మైనార్టీ కన్వీనర్ తెలంగాణ వల్లి, ఎద్దుల రామచంద్ర, నామా వేమకుమార్, భాస్కర్, మైనార్టీ ఉపాధ్యక్షులు అల్లాబకాష్, కుమ్మరాంపల్లె భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |