ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ మంత్రి నారాలోకేశ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని పశ్చిమ రాయలసీమ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పులివెందుల పట్టణంలోని జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలను ఎమ్మెల్సీ ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలోని ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. కోడిగుడ్డును అక్కడే తూకం వేయించారు. బరువు తక్కువ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో తాగునీటికి ఇబ్బంది ఉందని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురాగా వెంటనే ఆర్వోప్లాంటు ఏర్పాటు చేసేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొజ్జ మైసూరారెడ్డి, రమణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, కులశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |