2025లో CBSE బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రత్యేక చర్యలను ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు 10 మరియు 12 తరగతుల పరీక్షలు జరగనున్నందున, ఢిల్లీ మెట్రో తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ప్రాధాన్యత తనిఖీ మరియు టిక్కెట్ల అందజేతను అందిస్తుంది.ఢిల్లీలో నేటి నుంచి టెన్త్ , ఇంటర్ సీబీఎస్ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షల కోసం హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి.. భద్రతా తనిఖీలు లేకుండానే ఉచితంగా వెళ్లే వసతిని మెట్రో కల్పించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్‌లో విద్యార్థులు నానా హంగామా చేసిన వీడియో వైరలవుతోంది. దీనిపై వెంటనే ఢిల్లీ మెట్రో చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
![]() |
![]() |