గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌పై హోంమంత్రి అనిత స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వంశీ తప్పు చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఆధారాలతో వంశీని అరెస్టు చేసి పోలీసులు జైలుకు పంపారని తెలిపారు. దళితుడిని భయపెట్టి బెదిరించి వంశీ కిడ్నాప్ చేయించారన్నారు. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ ఆఫీసుపై దాడి జరిగితే కనీసం రక్షణ కల్పించలేదని అన్నారు. సీఎంను తిడితే బీపీ పెరిగి దాడి చేశారని నాడు జగన్ చెప్పాడరని.. వంశీ అరెస్టుపై నీతి కబుర్లు చెప్పడం ఏంటని ప్రశ్నించారు.సత్య వర్ధన్ బ్రదర్ వచ్చి వంశీని బెదిరించి బలవంతంగా అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పారని.. పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ తెగ బాధ పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. గత 5 ఏళ్లు టీడీపీపై అబద్ధపు కేసులు పెట్టారని, దాడులు చేశారని గుర్తు చేశారు. ‘‘మేము రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటే ఇన్ని నెలలు సమయం తీసుకోము’’ అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
![]() |
![]() |