తిరుమలలో ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఔటర్‌రింగు రోడ్డు నుంచి పాపవినాశనంకు రోడ్డు నిర్మాణానికి టీటీడీ పూనుకుంది. పాపవినాశనం తీర్థం, ఆకాశగంగ, జపాలి ఆంజనేయస్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయాలకు వెళ్లాలంటే నందకం సర్కెల్ లేదా అక్టోపప్ భవనం ముందు నుంచి గోగర్భం డ్యాం మీదుగా వెళ్లాలి. గోగర్భం డ్యాం నుంచి పాపవినాశనం వరకు రెండులైన్ల రోడ్డు మాత్రమే ఉండటంతో వాహనాల రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విశేష పర్వదనాలు, వారాంతాల్లో సర్వదర్శన క్యూలైన్ అక్టోపస్ సర్కిల్ దాకా వ్యాపిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలతో సమస్యలు వస్తున్నాయి. ఇందుకు పరిష్కారంగా నాలుగు లేన్ల రహదారిని ప్రతిపాదించారు. తొలిదశలో వాహనాలు గోగర్భం డ్యాం మీదుగా వెళ్లే అవసరం లేకుండా ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి క్షేత్రపాలకుని ఆలయం మీదుగా మఠాలు, డంపింగ్‌యార్డు, నేపాలి చెక్‌పోస్టుకు చేరుకునేలా రోడ్డు నిర్మాణం పనులు మొదలు పెట్టారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి మఠాల వరకు పాచికాల్వ ఉండటంతో వంతెన నిర్మించనున్నారు.రెండో దశలో..నేపాలి చెక్‌పోస్టు నుంచి ఆకాశగంగ వరకు ప్రస్తుతమున్న రెండు లైన్ల రోడ్డును నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించే పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లను తొలగించి సర్వే చేస్తున్నారు. ఆకాశగంగ నుంచి అటవీ భూములు కావడంతో అనుమతులు కోరారు.
![]() |
![]() |