దేశంలోనే పరిశుభ్రతలో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ‘‘స్వచ్చ ఆంధ్రా - స్వచ్చ దివాస్’’ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రతి నెలా మూడో శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. మన ఇళ్లు, ఇంటి పరిసరాలు, ఊరు పరిశుభ్రంగా ఉంటే దేశం శుభ్రంగా ఉంటుందని తెలిపారు. అధికారులు, కూటమి పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజలను జాగృతం చేయాలని సూచించారు. గతంలో ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీసిందని అన్నారు. గడిచిన ఐదేళ్లుగా అభివృద్ధి నిలిచిపోయిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
![]() |
![]() |