తిరుమల అలిపిరి టోల్‌గేట్‌లో ఫాస్ట్ ట్యాగ్ సిస్టం పనిచేయడం లేదు. దీంతో టోల్ ఫీజుకు నగదు తీసుకోవడానికి నిరాకరిస్తున్న సిబ్బంది.. ఫోన్ పే విధానంలోనే టోల్ ఫీజు కట్టాలని చెబుతున్నారు. సిబ్బంది నిర్వాకంతో వెంకన్న భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారం రోజులుగా ఇదే తంతు నడుస్తున్నా టీటీడీ పట్టించుకోవడంతో లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా అలిపిరి భద్రతా వలయం వద్ద వారి వాహనాలను తనిఖీలు చేసుకున్న అనంతరం టోల్‌గేట్‌లో ఫీజు కట్టిన తరువాత తిరమలకు వెళ్లాల్సి ఉంటుంది.అందులో భాగంగా గతంలో నేరుగా డబ్బులు వసూలు చేసిన టీటీడీ.. కొంత కాలంగా ఫాస్ట్ ట్యాగ్ విధానం రూపంలో వాహనదారుల వద్ద టోల్ ఫీజును వసూలు చేస్తోంది. అయితే గత వారం రోజులుగా ఫాస్ట్ ట్యాగ్ సిస్టంలో తలెత్తిన లోపాల కారణంగా ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది టీటీడీ. ఫోన్ పే ద్వారా భక్తుల నుంచి టోల్ ఫీజును వసూలు చేస్తోంది టీటీడీ. అయితే చాలా మంది భక్తులు వారి వద్ద ఫోన్ పే లేకపోవడంతో టోల్ ఫీజు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అక్కడున్న టోల్‌గేట్ సిబ్బందికి తమ వద్ద ఫోన్‌పే లేదని చెప్పటినప్పటికీ పట్టించుకోకపోవడమే కాకుండా.. భక్తులతో టోల్‌గేట్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా ఫోన్ పే ద్వారా డబ్బులు కడితేనే వాహనాలను అనుమతిస్తామని, లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |