జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీ రెడ్డి మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. దౌర్జన్యంగా జైపూర్ పోలీసులు వచ్చి… నన్ను అరెస్ట్ చేశారని తెలిపారు. లోకల్ పోలీసులు లేకుండా నన్ను అరెస్ట్ చేశారన్నారు. ఒక వెధవని వెధవా అంటూ నిరూపించడానికి ఒక మహిళకు చాలా కష్టం వచ్చిందని ఆవేదన చెందారు. 41 ఏ నోటీసులు ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నిస్తే జైపూర్ పోలీసుల వద్ద సమాధానం లేదని తెలిపారు.ప్రైవేట్ వెహికల్ లో జైపూర్ పోలీసులు ఎలా వచ్చారని ప్రశ్నించారు. జైపూర్ పోలీసులు వచ్చిన వాహనంలో వైట్ కలర్ షర్ట్ లో ఉన్న ఆ వ్యక్తి ఎవరు అని అడిగారు. చెన్నై ఎయిర్పోర్టులో నా బిడ్డను ఒంటరిగా వదిలి వచ్చారని బాధపడ్డారు. ఫ్లైట్ టికెట్ కు డబ్బులు లేకుండా మరుసటి రోజు మా అబ్బాయి జైపూర్ కు వచ్చాడని తెలిపారు.
![]() |
![]() |