ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా మహాకుంభమేళాకు తరలివెళ్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం, కుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి సంగమం అయ్యే ప్రాంతంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. ఈ నదుల సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి కోట్ల సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. మహాకుంభ మేళా కార్యక్రమం పురాణాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోందని చాలా మంది చెబుతారు. ఈ మహా కుంభమేళా ముఖ్య ఉద్దేశం పూర్వం అమృత కలశం కోసం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో, అందులోని అమృతపు చుక్కలు భూమి మీద పడ్డాయని, అందుకే నాలుగు ప్రదేశాలలో మహా కుంభమేళా జరుగుతుందని భక్తుల విశ్వాసం.ఈ మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించడం హిందూ సంప్రదాయం ప్రకారం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కానీ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసుల గారి మధ్య జరిగిన యుద్ధం 12 సంవత్సరాలు జరిగిందని. దేవతలు రాక్షసుల మధ్య జరిగిన 12 సంవత్సరాలు మనకు 144 సంవత్సరాలతో సమానమని చెబుతారు. ఇందులో భాగంగానే దాదాపు 144 సంవత్సరాల తర్వాత మళ్లీ మహా కుంభమేళా నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి కోట్ల సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి తరలి వెళ్తున్నారు.
![]() |
![]() |