ప్రేమికుల రోజు వాలెంటైన్స్ డే. ఇది ప్రేమ, ఆప్యాయతను జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ప్రేమలో ఉన్న వారు తమ ప్రియమైన వారికి బహుమతులు, గ్రీటింగ్ కార్డ్స్, పువ్వులు ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమికుల రోజు అనేది చాలా కాలంగా జరుపుకుంటున్న ఒక సంప్రదాయం. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా చాలా చిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పోలీసులు.సాధారణంగా ఏదైనా విపత్కర పరిస్థితుల సమయంలో.. ప్రజలు పోలీసుల సహకారం తీసుకుంటారు. ఇంట్లో దొంగలు పడ్డారనో.. లేదా ఏదైనా న్యూసెన్స్ విషయం, ఆస్తి తగాదాలపై కంప్లైంట్స్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక కంప్లైంట్ మాత్రం చాలా విచిత్రంగా, డిఫరెంట్‌గా, ఇన్నోవేటివ్‌గా వచ్చింది. అది కూడా డయల్ 100కి.. ఎంతో ఇంపార్టెంట్ ఉంటేనే డయల్ 100 కి కంప్లైంట్ వెళ్తుంది. అయితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్ తన ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని డైరెక్ట్‌గా ఫోన్ చేసి చెప్పింది ఓ యువతి.
![]() |
![]() |