మీకు బైక్ ఉందా అయితే సూపర్ గుడ్ న్యూస్. ఎందుకంటే ఉచితంగా పెట్రోల్ కొట్టించుకునే ఆఫర్ ఒకటి వచ్చింది. అతి కూడా ఈ నెల 28లోపే. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.మనకి తెలుసు ప్రస్తుతం పెట్రోల్ రెట్లు ఎలా పెరిగిపోతున్నాయో. ఎప్పుడో సెంచరీ దాటేశాయి. దాంతో సామాన్యులు బైక్ బయటికి తీయాలంటే ఆలోచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇలాంటి తరుణంలో BPCL మీకో ఆఫర్ ఇచ్చింది. అదేంటో వివరంగా తెలుసుకుందాం.ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ద్విచక్ర వాహనదారుల కోసం అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సంస్థ 45వ వార్షికోత్సవం సందర్భంగా ఫౌండేషన్ డే ఫెస్ట్ నిర్వహిస్తోంది.ఈ ఆఫర్‌లో ఏముంది? ఈ ప్రత్యేక ఆఫర్ కింద, టూ వీలర్ యూజర్లు ఉచితంగా ₹75 విలువైన పెట్రోల్ పొందే అవకాశం ఉంది.
ఇందుకు వారు BPCL రిటైల్ అవుట్‌లెట్ వద్ద MAK 4T లూబ్రికెంట్ కొనుగోలు చేయాలి.ఎప్పుడు, ఎక్కడ?: ఆఫర్ ప్రారంభం: జనవరి 24, 2024. ఆఫర్ ముగింపు: ఫిబ్రవరి 28, 2024, ఎంపిక చేసిన BPCL అవుట్‌లెట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఈ ఆఫర్ టూ వీలర్ వాహనదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. BPCL డీలర్లు, పంపిణీదారులు, ఛానల్ భాగస్వాములు, ప్రకటన ఏజెన్సీల ఉద్యోగులు, సర్వీస్ ప్రొవైడర్లు, ఈవెంట్ మేనేజర్లు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ ఆఫర్‌కు అర్హులు కారు. ఒక కస్టమర్ ఈ ఆఫర్‌ను ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అదే మొబైల్ నంబర్‌ను మరోసారి ఉపయోగించేందుకు వీలు లేదు.MAK 4T లూబ్రికెంట్ ఆయిల్ కొనుగోలు చేసిన తర్వాత, ₹75 విలువైన పెట్రోల్ తక్షణమే ఉచితంగా లభిస్తుంది. లూబ్రికెంట్ ప్యాక్‌లో ₹1000 వరకు క్యాష్ కూపన్ ఉంటుంది, దీన్ని అదే రిటైల్ అవుట్‌లెట్‌లో నగదుగా మార్చుకోవచ్చు. MAK Quick Kiosk వద్ద ఉచితంగా ఆయిల్ చెంజ్ చేయించుకోవచ్చు. హలో BPCL యాప్ ద్వారా కూపన్ QR కోడ్ స్కాన్ చేసి క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, KYC పూర్తిచేసిన తర్వాత కూపన్‌ను స్వయంగా స్కాన్ చేసుకోవచ్చు.టూ వీలర్ వాహనదారులు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుని ఉచిత పెట్రోల్ పొందొచ్చు. ఎలాంటి సందేహాలైనా ఉంటే, సమీప BPCL అవుట్‌లెట్‌ను సంప్రదించండి!
![]() |
![]() |