ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా..? ఐతే ఇవి తెలుసుకోండి

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 04:24 PM

సాధారణంగా మహిళలు గర్భం రాకుండా కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం చాలా రకాల గర్భనిరోధక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని పద్ధతులపై ఆందోళనకరమైన విషయాలు బయటకు వచ్చాయి. డెన్మార్క్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కొన్ని రకాల హార్మోనల్‌ కాంట్రాసెప్టివ్స్‌ను వాడితే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. ‘ది BMJ’ అనే జర్నల్‌లో ఈ స్టడీ ఫలితాలు పబ్లిష్ అయ్యాయి. ఇందులో భాగంగా దాదాపు ఇరవై లక్షల మంది మహిళల్ని పరిశీలించారు. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ కలిగిన గర్భనిరోధకాలు వాడేవాళ్లకి రిస్క్ ఎక్కువని తేల్చారు.1996 నుంచి 2021 వరకు డెన్మార్క్‌లో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్ల మెడికల్ రికార్డులు స్టడీ చేశారు. అందులో ముఖ్యంగా హార్మోనల్‌ కాంట్రాసెప్టివ్స్‌ వాడేవాళ్లపై ఫోకస్ పెట్టారు. అంటే కంబైన్డ్ ఈస్ట్రోజెన్-ప్రోజెస్టిన్ పిల్స్ (ఇవే చాలామంది వాడేది), వెజైనల్ రింగ్స్, స్కిన్ ప్యాచ్‌లు, ప్రోజెస్టిన్-ఓన్లీ పిల్స్, ఇంట్రా యుటెరైన్ డివైజ్‌లు (IUDs), ఇంప్లాంట్స్, ఇంజెక్షన్లు వంటి వాటన్నిటినీ స్టడీ చేశారు.అయితే రక్తం గడ్డకట్టడం, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లని, సైకియాట్రిక్ మెడిసిన్ లేదా హార్మోన్ థెరపీ తీసుకునేవాళ్లని ఈ స్టడీ నుంచి తప్పించేశారు. ఇస్కీమిక్ స్ట్రోక్, గుండెపోటు కేసులు రికార్డ్ చేశారు. వయసు, చదువు, హైబీపీ, డయాబెటిస్ లాంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు.ఈస్ట్రోజెన్ ఉన్న గర్భనిరోధకాలతో రిస్క్. ఈ స్టడీలో ఈస్ట్రోజెన్ ఉన్న గర్భనిరోధకాలు, ముఖ్యంగా వెజైనల్ రింగ్స్, స్కిన్ ప్యాచ్‌ల వల్ల రిస్క్ బాగా ఎక్కువని తేలింది. రిస్క్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.కంబైన్డ్ ఈస్ట్రోజెన్-ప్రోజెస్టిన్ పిల్స్ వీటి వల్ల స్ట్రోక్, గుండెపోటు రిస్క్ రెట్టింపు అయింది. అంటే ఈ పిల్స్ ఏడాది వాడితే 4,760 మంది మహిళల్లో ఒకరికి స్ట్రోక్, 10,000 మందిలో ఒకరికి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది. వెజైనల్ రింగ్స్, ఇతర గర్భనిరోధకాలు వీటి వల్ల స్ట్రోక్ రిస్క్ 2.4 రెట్లు, గుండెపోటు రిస్క్ 3.8 రెట్లు పెరిగింది. అలాగే స్కిన్ ప్యాచ్‌ల వల్ల స్ట్రోక్ రిస్క్ 3.4 రెట్లు పెరిగింది. ప్రోజెస్టిన్-ఓన్లీ కాంట్రాసెప్టివ్స్‌ (పిల్స్, ఇంప్లాంట్స్, ఇంజెక్షన్లు) వంటి వాటితో రిస్క్ కొంచెం పెరిగినా, ఈస్ట్రోజెన్ ఉన్న వాటితో పోలిస్తే తక్కువే. ప్రోజెస్టిన్-ఓన్లీ IUDs ఒక్కటే రిస్క్ పెంచని గర్భనిరోధకాలుగా తేలాయి. అంటే ఇవి కాస్త సేఫ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రిస్క్ తక్కువే అయినా, హార్మోన్ల గర్భనిరోధకాలు (హార్మోనల్‌ కాంట్రాసెప్టివ్స్‌) రాసే ముందు డాక్టర్లు ఈ విషయాలను కూడా ఆలోచించాలని స్టడీ చెబుతోంది. అయితే ఎంతకాలం గర్భనిరోధకాలు వాడారనే దాన్ని బట్టి రిస్క్ మారలేదు. తక్కువ కాలం వాడినా, ఎక్కువ కాలం వాడినా రిస్క్ ఒకేలా ఉంది.ఈ రిస్క్‌లు చాలా తక్కువైనా, చాలామంది మహిళలు హార్మోనల్‌ కాంట్రాసెప్టివ్స్‌ వాడుతున్నారు కాబట్టి సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమే అని స్టడీ చేసినవాళ్లు అంటున్నారు. స్వీడిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన థెరిస్ జోహన్సన్ మాట్లాడుతూ..రోజుకి లక్షల మంది మహిళలు ఈ గర్భనిరోధకాలు వాడుతున్నారు కాబట్టి, రిస్క్‌లను జాగ్రత్తగా అంచనా వేయడం చాలా ముఖ్యం అని అన్నారు. ఇది కేవలం అధ్యయనం మాత్రమే. అంటే ఇది డైరెక్ట్‌గా ఆయా ఆరోగ్య ప్రమాదాలకు కారణమవుతుందని అని చెప్పలేం. కానీ కొన్ని హార్మోన్ల గర్భనిరోధకాలు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయనే వాదనలకు మరింత బలం చేకూరింది.వివరాలకై తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com