రెండు వారాల క్రితం వరకూ ఎక్కువగా ఉన్న కూరగాయల ధరలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. సామాన్యుడికి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. రైతు బజార్‌లో కూరగాయల ధరలు అందుబాటులో ఉన్నాయి. కేజీ 20 రూపాయలకే దాదాపు అన్ని కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. వంకాయ దగ్గర నుంచి క్యారెట్ వరకు అన్ని కూరగాయల ధరలు కిలో 20 నుంచి 35 రూపాయలు ధరకే వస్తున్నాయి. అన్ని కూరగాయల ధరలు దాదాపు 40 లోపే ఉన్నాయని రైతు బజార్ ఎస్టేట్ అధికారి వరాహాలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వాతావరణం నెలకొందని.. అందుకే రైతు బజార్లలో కూరగాయలు ధరలు ఇలా చాలా తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ ఆధారమైన కొన్ని ప్రాంతాల్లో మామూలు స్థితి కారణంగా పంటలు బాగా పండుతున్నాయని.. ఆ కారణంగా ధరలు తగ్గుతున్నాయి అని చెబుతున్నారు. సాధారణంగా కూరగాయల్లో నిత్యావసరాలు అనేవి టమాట, ఉల్లి, బంగాళదుంప. ఈ మూడు ఇప్పుడు ధరలు తగ్గి ఇప్పుడు నిలకడగానే ఉన్నాయి. ఉల్లిపాయలు ఒక్కటే కేజీ 35 రూపాయలు పలుకుతున్నప్పటికీ.. మిగతా బంగాళాదుంపలు ఇతర ధరలు పూర్తిగా కిందికి వచ్చాయి.
![]() |
![]() |