మద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కన్న కొడుకును హత్యచేయించిన తల్లి. ప్రకాశం జిల్లాలో ఈ చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన సాలమ్మకు నలుగురు పిల్లలు. మూడో వాడైన శ్యాంబాబు(35) మద్యానికి బానిసై దొంగతనాలు కూడా చేసేవాడు. కొద్దిరోజుల కిందట మద్యం మత్తులో బంధువుల అమ్మాయితోను, చివరికి తల్లితోను అసభ్యంగా ప్రవర్తించాడు.దీంతో విసిగిన పోయిన తల్లి ఒక ఆటో డ్రైవర్ కు సుపారి ఇచ్చి, కొడుకును చంపించింది. ముక్కలుగా నరికి గోనె సంచిలో పెట్టి పంట కాలువలో పడేసింది. కాల్వగట్టుపై రక్తపు మరకలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ క్రమంలో పోలీసు విచారణలో నేరం అంగీకరించారు లక్ష్మి. ఇద్దరు సోదరులు మరొక వ్యక్తి సహాయంతో హత్య చేసినట్లు వెల్లడించారు.
![]() |
![]() |