వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసి ధైర్యం చెప్పారని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ తెలిపారు. త్వరలోనే వంశీని కలుస్తానని వైయస్ జగన్ చెప్పినట్లు ఆమె అన్నారు. మాకు వైయస్ఆర్‌సీపీ అన్ని రకాలుగా అండగా ఉంది. లీగల్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేశారని వివరించారు. విజయవాడ సబ్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం పంకజశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ సబ్ జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది. వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. వంశీ రిమాండ్‌లో ఉన్నారు.. కేసులు ఇంకా నిర్ధారణ కాలేదు. తప్పుడు కేసులతో వంశీని వేధిస్తున్నారు. వంశీకి ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. వంశీ శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. వంశీపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలే.వంశీ వెన్నపూస నొప్పితో, శ్వాసకోస సమస్యతో ఆయన బాధపడుతున్నారు. వంశీ కింద పడుకుంటున్నారు.. బెడ్ కావాలని రిక్వెట్ చేస్తాం. జైలులో ఎవ్వరినీ కలవనివ్వకుండా చేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని వంశీని.. మెంటల్‌గా టార్చర్ చేస్తున్నారు. మానసికంగా కుంగదీస్తున్నారు. వంశీ ఉన్న బారక్‌లో 60 సీసీ కెమెరాలు పెట్టారు. వంశీ ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళ్తాం. ఇదే సమయంలో సత్యవర్ధన్‌ని పోలీసులు అదుపులో తీసుకొని మేజిస్ట్రేట్ ముందుఎందుకు ప్రవేశపెట్టడం లేదు.
![]() |
![]() |