2025 IPL లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది. ముందుగా ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా లక్నో మొదట బాటింగ్ కి దిగింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్( 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72), నికోలస్ పూరన్( 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 75 పరుగులు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు సాధించగా.. విప్రాజ్ నిగమ్, ముఖేష్ కుమార్ తలా వికెట్ సాధించారు.
210 పరుగుల భారీ లక్షాన్నిసాధించడానికి దిగిన ఢిల్లీ మొదట్లోనే 3 వికెట్లు కోల్పోయారు. డ్యూప్లెసిస్ మరియూ అక్షర్ పటేల్ మధ్య కొంత భాగస్వామ్యం కొనసాగిన ముందు అక్షర్ తర్వాత డ్యూప్లెసిస్ ఔట్ అయ్యి వెనుతిరిగారు. ఢిల్లీ బ్యాటర్లలో అశుతోష్‌తో పాటు విప్రజ్ నిగమ్( 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), స్టబ్స్(34) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అశుతోష్ తన ఎదుర్కొన్న ఆఖరి 11 బంతుల్లో ఏకంగా 44 పరుగులు చేయడం విశేషం. మొత్తంగా 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అతడి విధ్వంసం ఫలితంగా ఢిల్లీ.. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో అందుకుంది.
![]() |
![]() |