వైజాగ్ వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) సంచలన విజయాన్ని నమోదు చేసింది. 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టును అశుతోశ్ శర్మ ఒంటిచేత్తో గెలిపించాడు. కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులు చేయడం విశేషం. చివరి మూడు ఓవర్లలో కేవలం 11 బంతుల్లో 46 రన్స్ బాదాడు. అతని తుపాన్ ఇన్నింగ్స్ కారణంగానే డీసీ ఓటమి అంచు నుంచి విజయతీరాలకు చేరింది. ఇక తన అద్భుత ఇన్నింగ్స్ తర్వాత అశుతోశ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డును తన గురువు, మెంటార్ అయిన భారత మాజీ ఆటగాడు శిఖర్ ధావన్‌కు అంకితం చేశాడు. "ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నా గురువు శిఖర్ పాజీకి అంకితం చేయాలనుకుంటున్నాను" అని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో అశుతోశ్ తెలిపాడు. ఆ తర్వాత డీసీ డ్రెస్సింగ్ రూమ్‌లో పార్టీ ప్రారంభానికి కొన్ని క్షణాల ముందు అశుతోశ్ వీడియో కాల్‌లో ధావన్‌తో మాట్లాడుతూ కనిపించాడు. ఈ సందర్భంగా అశుతోశ్‌ను గబ్బర్ అభినందించాడు.కాగా, ధావన్, అశుతోశ్ 2024 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)కు ప్రాతినిధ్యం వహించారు. గత సీజన్ లో కూడా పంజాబ్ తరఫున అశుతోశ్ కొన్ని మ్యాచుల్లో చక్కటి ఫినిషర్ పాత్ర పోషించాడు. దీంతో ఈసారి మెగా వేలంలో అతడిని ఢిల్లీ రూ. 3.80 కోట్లకు దక్కించుకుంది.
![]() |
![]() |