2025 IPL లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలి మ్యాచ్ లో పంజాబ్ విక్టరీ కొట్టింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (74), బట్లర్ (54) పరుగులు చేశారు. చివర్లో రన్స్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో గుజరాత్ ఆటగాళ్లు తడబడ్డారు. చివరికి పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. సిక్సర్లతో శ్రేయస్ విరుచుకుపడ్డాడు. ఐదు ఫోర్లు బాదగా.. 9 సిక్సర్లు బాది గ్రౌండ్ మొత్తం ఆడేసుకున్నాడు. బంతులు ముగియడంతో నాటౌట్ గా వెనుదిరిగాడు. ప్రియాంశ్ ఆర్య 47 పరుగులు చేసి సత్తా చాటగా.. శశాంక్ సింగ్ 44 పరుగులు చేశాడు. మొదట భారీగా పరుగులు చేసిన పంజాబ్.. తర్వాత నెమ్మదించింది. ఆఖరులో పంజాబ్ బౌలర్లు పంజాబ్ స్కోర్ బోర్డుకు అడ్డుకట్ట వేశారు. బౌలింగ్‌లో సాయి కిశోర్ 3 కీలక వికట్లు తీశాడు. కగిసో రబడా, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
244 లక్ష్య ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఓవర్లు పూర్తి చేసుకుని 11 పరుగుల దూరంలో నిలిచి విజయాన్ని అందుకోలేకపోయింది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడి 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 33 బంతుల్లో అర్థం సెంచరీ చేసుకోగా.. రూతర్ ఫోర్డ్ 46 పరుగులు చేశాడు. బ్యాటర్లు విధించిన లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ బౌలర్లు కాపాడారు. అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కో జాన్సెన్ తలా వికెట్ తీశారు. గెలుపుపై ఆశల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు సొంత మైదానంలో తీవ్ర నిరాశ ఎదురైంది.
![]() |
![]() |