పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌లో అయ్యర్ సెల్ఫ్‌లెస్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన సెంచరీ కోసం, వ్యక్తిగత రికార్డుల కోసం ఏ మాత్రం ఆలోచించకుండా అయ్యర్ ఓ కెప్టెన్‌గా నడుచుకున్న తీరు అందరిని ఫిదా చేసింది. సెంచరీల కోసం అవతలి ఎండ్‌లోని బ్యాటర్లకు కనీసం స్ట్రైక్ ఇవ్వకుండా మొత్తం ఓవర్లు ఆడే బ్యాటర్లు ఉన్న ఈ రోజుల్లో అయ్యర్ ప్రవర్తించిన తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి. 42 బంతుల్లో 97 పరుగులు చేసిన అయ్యర్ పంజాబ్ కింగ్స్ చివరి ఓవర్‌లో కనీసం ఒక్క బంతి కూడా ఆడలేదు అయ్యర్. కనీసం సింగిల్ తీసి తనకు స్ట్రైక్ ఇవ్వాలని కూడా అవతలి ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న శశాంక్ సింగ్‌ని అడగలేదు. ఎందుకంటే శశాంక్ మంచి ఊపుమీద ఉన్నాడు. చివరి ఓవర్‌లో చెలరేగి ఆడాడు. లాస్ట్ ఓవర్‌లో పంజాబ్ ఏకంగా 23 పరుగులు చేసింది. గుజరాత్ ఓడిపోవడానికి ఈ ఓవరే కారణమైంది. ఒక వేళ సెంచరీ కోసం అయ్యర్ ఆలోచించి ఉంటే 23 పరుగులు కచ్చితంగా వచ్చేవి కావు. అందుకే అయ్యర్ అలా చేయలేదు. శశాంక్‌కే పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. అసలుసిలసైన కెప్టెన్ అనిపించుకున్నాడు.
![]() |
![]() |