2025 IPL లో భాగంగా నేడు మరో ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరగనుంది. రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించింది. 284 పరుగుల చేయగలిగింది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. SRH జట్టు గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి పటిష్ఠ స్థితిలో ఉంది. ఇషాన్ కిషన్ (106 నాటౌట్), ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌ల బ్యాటింగ్ దాడితో 286 పరుగుల భారీ స్కోరు సాధించిన SRH, ఈ సీజన్‌లో ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఈ జట్టు బ్యాటింగ్ లైనప్ లక్నో బౌలర్లకు పెద్ద సవాలుగా మారనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. మిచెల్ మార్ష్ (72), నికోలస్ పూరన్ (75) అద్భుతంగా ఆడినప్పటికీ, ఆశుతోష్ శర్మ (66) విధ్వంసకర బ్యాటింగ్‌తో LSG విజయాన్ని చేజార్చాడు. రిషభ్ పంత్ నాయకత్వంలోని ఈ జట్టు ఈ ఓటమి నుంచి తేరుకుని, SRHపై పోరాడేందుకు సిద్ధమవుతోంది. చూడాలి ఈ మ్యాచ్ ఈ మత్క్ ఎవరు గెలుస్తారో..
![]() |
![]() |