రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబును జనసేన నేత జయమంగళ వెంకటరమణ కలిశారు. చంద్రబాబు కాళ్లకు నమస్కరించారు. ఈ సందర్భంగా జయమంగళను చంద్రబాబు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. 1999లో టీడీపీ ద్వారా జయమంగళ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో టీడీపీ తరపున కైకలూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఫిబ్రవరిలో వైసీపీలో చేరారు. 2023 మార్చిలో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2024 నవంబర్ 23న వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఎమ్మెల్సీ పదవికి జయమంగళ చేసిన రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించకపోవడం గమనార్హం.
![]() |
![]() |