డల్లాస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఒంటిపై నూలుపోగు లేకుండా వింతగా ప్రవర్తిస్తూ బీభత్సం సృష్టించింది. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కొరకడంతో పాటు ఇద్దరు ఎయిర్‌పోర్టు సిబ్బందిని పెన్సిల్‌తో పొడిచింది. మార్చి 14న సమంతా పాల్మా అనే మహిళ ఇలా కొద్దిసేపు విమానాశ్రయంలో తన వింత ప్రవర్తనతో అందరినీ పరుగులు పెట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె సెక్యూరిటీ గార్డులపై అరుస్తూ, బూతులు తిట్టడం కనిపించింది. గాలిలోకి నీళ్లు చల్లుతూ నృత్యం చేసింది. తనను తాను 'వీనస్ దేవత'గా చెప్పుకున్న పాల్మా... విమానాశ్రయంలో ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక రెస్టారెంట్ మేనేజర్‌ను పెన్సిల్‌తో తల, ముఖంపై పొడిచింది. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చివరికి ఎలాగోలా భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను మానసిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆమె మానసికస్థితి సరిగా లేకపోవడంతోనే ఇలా ప్రవర్తించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
![]() |
![]() |